సహకార సంఘాల్లో పంట రుణాల తేదీల నమోదులో జరిగిన ఆలస్యం అర్హులకు కూడా రుణమాఫీ వర్తించకుండా చేసింది. ఈ సమస్య తలెత్తింది కారణంగా సిబ్బంది చేసిన పొరపాట్లు, సాంకేతికపరమైన ఇక్కట్లే ఇందుకు కారణంగా తేల్చారు. ఉమ్మడి జిల్లాలోని 39 సహకార సొసైటీల్లో ఈ సమస్య తలెత్తింది. ఇలా సందిగ్ధత నెలకొన్న రుణ బకాయిల మొత్తం సుమారు రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. రైతుల నుంచి ఎలాంటి పొరపాటు లేకపోవటంతో.. వారిని అర్హులుగా గుర్తించి మాఫీ వర్తింపజేయాలంటూ అధికారులు ఇప్పటికే ఉన్నత స్థాయికి నివేదించారు. అక్కడ నిర్ణయం తీసుకొనే వరకు బాధిత రైతుల అప్పుల మాఫీ విషయంలో సందిగ్ధత కొనసాగనుంది. కాగా ఈ పొరపాట్లకు బాధ్యులుగా పేర్కొంటూ ఆయా సంఘాల కార్యదర్శులకు ఇటీవలే షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వాటికి దాదాపు 35 మంది వరకు సమాధానాలు కూడా ఇచ్చినట్లు సంబంధితశాఖ అధికారి ఒకరు చెప్పారు.
మాఫీకి గతేడాది డిసెంబరు 9వ తేదీలోపు రుణాలు పొందిన వారే అర్హులు. సహకార సొసైటీలు తమ పరిధిలోని రైతులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ) నుంచి రుణాలు మంజూరు చేయిస్తాయి. ఈ సందర్భంలో ఓ సొసైటీకి చెందిన రైతులందరికీ మంజూరైన రుణాల మొత్తాన్ని మొదట సొసైటీ ఖాతాల్లో వేసి అనంతరం రైతుల ఖాతాల్లోకి విడిగా జమ చేశారు. ఈ క్రమంలో సహకార బ్యాంకు నుంచి రుణాలు మంజూరైన తేదీ నుంచి.. రైతు ఖాతాలో జమ చేసే నాటికి ఆలస్యం జరిగింది. మాఫీ అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకుల నుంచి పంట రుణాల వివరాలు సేకరించింది. ఈ సందర్భంలో సహకార సొసైటీల పరిధిలోని రుణాల వివరాలను తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు(టెస్కాబ్) నుంచి తీసుకుంది. రైతుల ఖాతాల్లో రుణాల సొమ్ము జమ చేసిన తేదీలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. అవి డిసెంబరు 9 తర్వాత తేదీలు కావడంతో సదరు ఖాతాలకు రుణమాఫీ వర్తించలేదు.
సహకార సొసైటీల్లో పంటరుణాల ఖాతాల వివరాలను ఇంటలెక్ట్ సాఫ్ట్‌వేర్ ద్వారా నిర్వహిస్తుంటారు. రుణాల మంజూరు, వడ్డీ చెల్లింపు, రెన్యువల్ వివరాలు మొదట మ్యాన్‌వల్‌గా రికార్డు పుస్తకాల్లో నమోదు చేసేవారు. కొన్నిరోజులు గడిచాక కూడా వివరాలను రైతు చెల్లించిన తేదీ వేసి ఆన్‌లైన్ చేసే వెసులుబాటు ఈ సాఫ్ట్‌వేర్‌లో గతంలో ఉండేది. ఇలా 3 నెలల వరకు పూర్వ తేదీలు వేయటానికి వీలుండేది. కానీ ప్రస్తుతం ఆ అవకాశం లేదనే విషయం చాలా సొసైటీల్లో పనిచేసే పొరుగు సేవల కంప్యూటర్ ఆపరేటర్లకు తెలియదు. వీరు ఎప్పటిలాగే ఆలస్యంగా రుణాల వివరాలు నమోదు చేయగా.. అవి పూర్వం తేదీలు తీసుకోలేదు. దీంతో సమస్య ఏర్పడింది. షోకాజ్ నోటీసులు అందుకున్న కార్యదర్శుల్లో కొందరు ఇచ్చిన సమాధానంలో కొత్త రుణాల ఖాతాల విషయంలోనే సమస్య తలెత్తినట్లు పేర్కొన్నారు. కొత్త ఖాతాలు ఏర్పాటు చేసి రుణాల సొమ్ము జమ చేయాలంటే.. డీసీసీబీ బ్యాంకు ప్రక్రియలో ఆలస్యమైనట్లు వివరణ ఇచ్చారు. ఏదీ ఏమైనా ఉమ్మడి జిల్లాలో చోటుచేసుకున్న ఈ పొరపాట్ల అంశం.. ఇప్పుడు ప్రభు